ఉద్యోగుల బదిలీలపై సీఎస్‌ కమిటీ

ABN , First Publish Date - 2020-08-22T14:09:56+05:30 IST

ఉద్యోగుల బదిలీ విధానం, నిబంధనలపై అధ్యయనం చేసి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు.

ఉద్యోగుల బదిలీలపై సీఎస్‌ కమిటీ

అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల బదిలీ విధానం, నిబంధనలపై అధ్యయనం చేసి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. ఉద్యోగుల బదిలీల్లో మరింత పారదర్శకత ఉండేలా చేసేందుకు ఏం చేయాలన్న అంశంపై ఈ కమిటీ 14 రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా సీసీఎల్‌ఏ, డీజీపీ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, జీఏడీ కార్యదర్శిని నియమించారు. 

Updated Date - 2020-08-22T14:09:56+05:30 IST