ఉన్నత విద్యామండలి కార్యదర్శికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-09-18T16:27:56+05:30 IST

తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యదర్శికి గురువారం కరోనా నిర్ధారణ అయింది. దీంతో శుక్ర, శనివారాలు కార్యాలయానికి సెలవు

ఉన్నత విద్యామండలి కార్యదర్శికి కరోనా పాజిటివ్‌

నేడు, రేపు కార్యాలయం బంద్‌ 

హైదరాబాద్‌, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యదర్శికి గురువారం కరోనా నిర్ధారణ అయింది. దీంతో శుక్ర, శనివారాలు కార్యాలయానికి సెలవు ప్రకటించారు. కార్యాలయంలోని అన్ని విభాగాలను శానిటైజ్‌ చేశారు. కార్యాలయ అధికారులు, సిబ్బంది విధిగా కరోనా టెస్టులు చేసుకోవాలని ఉన్నత విద్యామండలి చైర్మన్‌  పాపిరెడ్డి ఆదేశించారు. సోమవారం కార్యాలయానికి వచ్చే వారు టెస్ట్‌ రిపోర్టు చూపించాల్సి ఉంటుందన్నారు.

Updated Date - 2020-09-18T16:27:56+05:30 IST