పఠనాసక్తి పెంపొందించడమే లక్ష్యం
ABN , First Publish Date - 2020-11-27T15:28:28+05:30 IST
విద్యార్థులు, యువతలో పఠనాసక్తి పెంపొందిచాలన్న లక్ష్యంతో ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమాన్ని చేపట్టినట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. గురువారం

‘చదవడం మాకిష్టం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సురేశ్
గుంటూరు, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు, యువతలో పఠనాసక్తి పెంపొందిచాలన్న లక్ష్యంతో ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమాన్ని చేపట్టినట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. గురువారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా.. గుంటూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా నివారణ చర్యల కోసం పాఠశాలలకు రూ.50 కోట్లు కేటాయించామన్నారు.
ఐదు జిల్లాల్లో బడికి సెలవులు.. తుఫాను ప్రభావంతో ఐదు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్టు మంత్రి తెలిపారు.