తెలంగాణ‘సెట్’లన్నీ ఆగస్టులోనే పూర్తిచేద్దాం
ABN , First Publish Date - 2020-07-18T21:32:56+05:30 IST
వాయిదాపడ్డ సెట్‌లను ఆగస్టులోనే పూర్తిచేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఈ పరీక్షలకు స్లాట్లు ఆగస్టులో

హైదరాబాద్, జూలై 17(ఆంధ్రజ్యోతి): వాయిదాపడ్డ సెట్‌లను ఆగస్టులోనే పూర్తిచేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఈ పరీక్షలకు స్లాట్లు ఆగస్టులోనే ఉన్నందున ఆ నెలలో నిర్వహించకపోతే అక్టోబరు వరకు అవకాశం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. వాయిదాపడ్డ సెట్‌ల నిర్వహణ, చివరి సంవత్సరం పరీక్షలు, కొత్త విద్యాసంవత్సరం క్యాలెండర్‌పై ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. యూజీసీ తాజా షెడ్యూల్ ప్రకారం కొత్త విద్యాసంవత్సరం ప్రారంభించాలన్నా ఆగస్టులో పరీక్షలన్నీ పూర్తిచేయడం తప్పనిసరి అనే అభిప్రాయానికి వచ్చారు. ఇదే విషయాన్ని ప్రభుత్వంతోపాటు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.