రైల్వే పరీక్షల్లో ‘తెలుగు’కు స్థానం ఇవ్వండి
ABN , First Publish Date - 2020-12-15T15:11:09+05:30 IST
త్వరలో జరిగే రైల్వే రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో తెలుగులో ప్రశ్నాపత్రాలు ఇవ్వాలని ఆంధ్రా మేధావుల వేదిక డిమాండ్ చేసింది. సోమవారం ఆన్‌లైన్ సమావేశం సందర్భంగా ఆంధ్రా మేధావుల

లేకపోతే పోరాటమే: ఆంధ్రా మేధావుల వేదిక
విజయవాడ, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): త్వరలో జరిగే రైల్వే రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో తెలుగులో ప్రశ్నాపత్రాలు ఇవ్వాలని ఆంధ్రా మేధావుల వేదిక డిమాండ్ చేసింది. సోమవారం ఆన్‌లైన్ సమావేశం సందర్భంగా ఆంధ్రా మేధావుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ రైల్వేశాఖలో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో తెలుగు భాషలో ప్రశ్నాపత్రం ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 58 మంది ఎంపీలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలుగువారికి జరుగుతున్న అన్యాయంపై గొంతు విప్పాలని డిమాండ్ చేశారు.