ఫ్రెషర్స్‌కు బ్యాక్‌లాగ్‌ ప్రశ్నపత్రం

ABN , First Publish Date - 2020-12-19T16:32:38+05:30 IST

ఎంజీయూ మొదటి సంవత్సరం సెకండ్‌ సెమిస్టర్‌ పరీక్షల్లో గందరగోళం నెలకొంది. భువనగిరి

ఫ్రెషర్స్‌కు బ్యాక్‌లాగ్‌ ప్రశ్నపత్రం

ఎంజీయూ పరీక్షల్లో గందరగోళం 

భువనగిరి టౌన్‌, డిసెంబరు 18: ఎంజీయూ మొదటి సంవత్సరం సెకండ్‌ సెమిస్టర్‌ పరీక్షల్లో గందరగోళం నెలకొంది. భువనగిరిలోని ఓ పరీక్ష కేంద్రంలో శుక్రవారం బీబీఏ మొదటి సంవత్సరం సెకండ్‌ సెమిస్టర్‌  పరీక్ష సందర్భంగా ఫ్రెషర్స్‌కు బ్యాక్‌లాగ్‌ ప్రశ్నపత్రం ఇచ్చారు. విద్యార్థులు ఈ విషయాన్ని ఇన్విజిలేటర్‌ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. ‘మేము సరైన ప్రశ్నపత్రమే ఇచ్చాం’ అని చెప్పారు.


దీంతో ఆందోళనకు గురైన ఓ విద్యార్థిని పరీక్ష హాలులోనే ఫిట్స్‌తో పడిపోయింది. ఈ విషయమై ఎంజీయూ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ మిర్యాల రమే్‌షను వివరణ కోరగా విద్యార్థులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. Read more