వ్యవసాయ వర్సిటీకి జాతీయ అవార్డు

ABN , First Publish Date - 2020-12-19T16:20:19+05:30 IST

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. సమీకృత వ్యవసాయ విధానంపై ఏర్పాటైన అఖిల భారత సమన్వ

వ్యవసాయ వర్సిటీకి జాతీయ అవార్డు

హైదరాబాద్‌, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. సమీకృత వ్యవసాయ విధానంపై ఏర్పాటైన అఖిల భారత సమన్వయ పరిశోధన ప్రాజెక్టుకి 2018-20కి జాతీయ ఉత్తమ పురస్కారం దక్కింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ నెల 15 నుంచి 18 వరకు ఐకార్‌-ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మింగ్‌ సిస్టమ్‌ రీసెర్చ్‌ నిర్వహించిన ద్వైవార్షిక వర్క్‌షాప్‌ సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేశారు.


చీఫ్‌ అగ్రానిమిస్ట్‌ డాక్టర్‌ గోవర్థన్‌ నేతృత్వంలోని బృందం ఈ ప్రాజెక్టును నిర్వహించింది. శుక్రవారం జరిగిన ప్లీనరీ సెషన్‌లో ఉపకులపతి డాక్టర్‌ ప్రవీణ్‌రావు ఈ పురస్కారాన్ని గోవర్థన్‌ బృందానికి ఇచ్చారు. 



Updated Date - 2020-12-19T16:20:19+05:30 IST