ఎన్‌హెచ్‌ఏఐతో ఏపీ నిట్‌ ఒప్పందం

ABN , First Publish Date - 2020-10-13T14:18:37+05:30 IST

నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో ఆంధప్రదేశ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఏపీ నిట్‌) ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ నిట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సూర్యప్రకాశ్‌రావు,

ఎన్‌హెచ్‌ఏఐతో ఏపీ నిట్‌ ఒప్పందం

ట్రాన్ప్‌పోర్ట్‌ ఇంజనీరింగ్‌లో పరిశోధనలు


తాడేపల్లిగూడెం, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో ఆంధప్రదేశ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఏపీ నిట్‌) ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ నిట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సూర్యప్రకాశ్‌రావు, జాతీయ రహదారి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డి.సురేంద్రనాథ్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. గుండుగొలను నుంచి అనకాపల్లి, విశాఖ నుంచి ఒడిసా వ రకు ఉన్న జాతీయ రహదారిపై సంస్థతో ఈ ఒప్పందం కుదిరింది.


దీంతో విద్యార్థులు ఇంటర్న్‌షి్‌పకు, ట్రాన్స్‌పోర్ట్‌ ఇంజనీరింగ్‌లో పరిశోధనలు జరుపుతారు. పరిశోధన కాలంలో బీటెక్‌ విద్యార్థులకు రూ.8 వేలు, ఎంటెక్‌ విద్యార్థులకు రూ.15 వేల నెలసరి వేతనం ఇస్తారు. వేసవి సెలవుల్లో ఇలాంటి పరిశోధనలు ఉంటాయి. జాతీయ రహదారి ఉద్యోగులు తమ సంస్థలో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల నిర్వహణకు వీలు కలుగుతుంది. ఇప్పటి వరకు పలు సంస్థలతో నిట్‌ 10 ఒప్పందాలను కుదుర్చుకున్నట్టు డైరెక్టర్‌ వెల్లడించారు. ఇ న్‌ చార్జ్‌ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ దినేష్‌, జాతీయ రహదారి అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-13T14:18:37+05:30 IST