వ్యవసాయ డిగ్రీ కోర్సులకు 16 వరకు కౌన్సెలింగ్
ABN , First Publish Date - 2020-12-10T16:26:47+05:30 IST
బీఎస్సీ అగ్రికల్చర్, బీవీఎస్సీ, బీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో

హైదరాబాద్, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): బీఎస్సీ అగ్రికల్చర్, బీవీఎస్సీ, బీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బుధవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఈనెల 16 వరకు తొలి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని రిజిస్ట్రార్ సుధీర్ కుమార్ తెలిపారు. ఎంసెట్- 2020లో 190వ ర్యాంకు సాధించిన కె. రాజేశ్వరికి రిజిస్ట్రార్ సుధీర్ కుమార్ తొలుత ప్రవేశపత్రం అందించి కౌన్సెలింగ్‌ను ప్రారంభించారు.