విద్యాసంవత్సరం మధ్యలో తరలింపు ఉండదు

ABN , First Publish Date - 2020-01-08T17:25:37+05:30 IST

‘‘విద్యా సంవత్సరం మధ్యలో విశాఖపట్నానికి రాజధాని తరలింపు ఉండదు. ఈ నెల 20, 26 నాటికి తరలిస్తారంటూ వస్తున్న ప్రచారాలను ఉద్యోగులు నమ్మి ఆందోళనకు గురికావద్దు. అదే జరిగితే ప్రభుత్వాన్ని టైం అడుగుతాం.

విద్యాసంవత్సరం మధ్యలో తరలింపు ఉండదు

మునుగుతుందని తెలిసీ బాబు వెధవ పని
సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి
 
అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ‘‘విద్యా సంవత్సరం మధ్యలో విశాఖపట్నానికి రాజధాని తరలింపు ఉండదు. ఈ నెల 20, 26 నాటికి తరలిస్తారంటూ వస్తున్న ప్రచారాలను ఉద్యోగులు నమ్మి ఆందోళనకు గురికావద్దు. అదే జరిగితే ప్రభుత్వాన్ని టైం అడుగుతాం. ఇంత తొందరగా తరలింపు సాధ్యం కాదు. ఇప్పట్లో తరలింపు జరగనే జరగదు. ఇది ఉద్యోగుల ప్రెండ్లీ ప్రభుత్వం. ఉద్యోగులతో సంప్రదించకుండా నిర్ణయం తీసుకోదు’’ అని సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేస్తుందనే నమ్మకం తనకుందన్నారు. తరలింపుపై నిర్ణయం తీసుకున్నాక తమ సమస్యలను దానిదృష్టికి తీసుకెళతామన్నారు.
  ఉద్యోగులను భయపెట్టిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. ‘‘రాజధాని గురించి మాట్లాడకూడదనుకున్నాం. చంద్రబాబు రెచ్చగొట్టి మాతో మాట్లాడిస్తున్నాడు. రాజధాని అమరావతిలో పెట్టడం సమంజసమేనా? మునిగిపోతుందని తెలిసీ రాజధాని నగర నిర్మాణం చేపట్టే వెధవ పని చేసింది బాబు కాదా? ఉద్యోగులను ప్రభుత్వంపై ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారు’’ అని విమర్శించారు. హైదరాబాద్‌ నుంచి అమరావతికి, అమరావతి నుంచి విశాఖకు తరలించేటప్పుడు ఏ కమిటీ కూడా తమ అభిప్రాయాలు తీసుకోలేదని అన్నారు.

Updated Date - 2020-01-08T17:25:37+05:30 IST