రిజర్వేషన్ల నుంచి మినహాయించండి: ఐఐఎంలు

ABN , First Publish Date - 2020-01-02T14:34:59+05:30 IST

రిజర్వేషన్ల నుంచి మినహాయించండి: ఐఐఎంలు

రిజర్వేషన్ల నుంచి మినహాయించండి: ఐఐఎంలు

న్యూఢిల్లీ, జనవరి 1: ఉపాధ్యాయ నియామకాల్లో రిజర్వేషన్ల అమలు నుంచి తమను మినహాయించాలని దేశవ్యాప్తంగా ఉన్న 20 ఐఐఎమ్‌లు కేంద్ర మానవ వనరుల శాఖను కోరాయి. టీచర్ల రిక్రూట్‌మెంట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థిక బలహీన వర్గాల రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం ఈ విద్యాసంస్థలకు బుధవారం లేఖ రాసింది. దీంతో ఐఐఎమ్‌లు ఈ విధంగా స్పందించాయి. ఈ విద్యాసంస్థల్లో టీచర్ల నియామకానికి సంబంధించి ప్రస్తుతం ఈ రిజర్వేషన్లు అమలు కావడం లేదు. శాస్త్రీయ, సాంకేతిక ఉపాధ్యాయ పోస్టుల్లో రిజర్వేషన్లు పాటించనవసరం లేదంటూ 1975లో సిబ్బంది, వ్యవహారాల శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నియామకాలు జరుగుతున్నాయి.

Updated Date - 2020-01-02T14:34:59+05:30 IST