ఎంసెట్‌-2 కేసుపై త్వరలో ట్రయల్‌!

ABN , First Publish Date - 2020-01-31T16:12:51+05:30 IST

ఎంసెట్‌-2 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీఐడీ గత జూలైలో దాఖలు చేసిన చార్జిషీట్‌ను నాంపల్లి కోర్టు పరిగణలోకి తీసుకుంది. చార్జిషీట్‌ను పూర్తిస్థాయిలో పరిశీలించిన

ఎంసెట్‌-2 కేసుపై త్వరలో ట్రయల్‌!

సీఐడీ చార్జిషీటులో జేఎన్‌టీయూ, శ్రీ చైతన్య పేర్లు
హైదరాబాద్‌, జూలై 30(ఆంధ్రజ్యోతి): ఎంసెట్‌-2 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీఐడీ గత జూలైలో దాఖలు చేసిన చార్జిషీట్‌ను నాంపల్లి కోర్టు పరిగణలోకి తీసుకుంది. చార్జిషీట్‌ను పూర్తిస్థాయిలో పరిశీలించిన న్యాయస్థానం దానికి నెంబరు కేటాయించింది. రెగ్యులర్‌ ట్రయల్‌కు సంబంధించి త్వరలోనే తేదీని ప్రకటించనుంది. 150 మంది విద్యార్ధులు సహా 300 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేసిన సీఐడీ వాటిని చార్జిషీట్‌లో పొందుపర్చింది. ఈ కేసులో మొత్తం 90 మంది నిందితులను గుర్తించగా 64 మందిని అరెస్ట్‌ చేశారు. చార్జిషీట్‌లో జేఎన్‌టీయూ, శ్రీచైతన్య కాలేజీల పేర్లను కూడా సీఐడీ ప్రస్తావించింది.

Updated Date - 2020-01-31T16:12:51+05:30 IST