బడిలో నర్సరీ .. పిల్లల్ని పంపని తల్లిదండ్రులు

ABN , First Publish Date - 2020-01-10T15:54:34+05:30 IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం టీరేపాక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నర్సరీ ఏర్పాటును నిరసిస్తూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడికి పంపలేదు. రెండో విడత పల్లెప్రగతిలో భాగంగా టీ రేపాక బడిలో

బడిలో నర్సరీ .. పిల్లల్ని పంపని తల్లిదండ్రులు

ఆత్మకూరు(ఎం), జనవరి 9: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం టీరేపాక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నర్సరీ ఏర్పాటును నిరసిస్తూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడికి పంపలేదు. రెండో విడత పల్లెప్రగతిలో భాగంగా టీ రేపాక బడిలో నర్సరీని ఏర్పాటు చేశారు. ఎస్‌ఎంసీ చైర్మన్‌ రాపోలు కనకమ్మ అధ్యక్షతన పాఠశాలలో బుధవారం నిర్వహించిన సమావేశంలో విష పురుగులు తిరిగే ప్రమాదం ఉందని అందుకే నర్సరీని తక్షణమే తొలగించాలని, లేని పక్షంలో తమ పిల్లలను పాఠశాలకు పంపించబోమని గ్రామస్తులు తీర్మానించి గురువారం పిల్లల్ని పాఠశాలకు పంపించలేదు.

Read more