మే 2 నుంచి సీఏ పరీక్షలు
ABN , First Publish Date - 2020-01-02T14:35:56+05:30 IST
మే 2 నుంచి సీఏ పరీక్షలు

చార్టర్డ్ అకౌంటెంట్ల (సీఏ) పరీక్షలు 2020, మే 2 నుంచి 18వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 207 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే, అబుధాబి, దోహా, దుబాయి, ఖాట్మండూ, మస్కట్‌ల్లోనూ ఈ పరీక్షలు రాయొచ్చు.