చెరువులో పడి ముగ్గురు విద్యార్థుల మృతి

ABN , First Publish Date - 2020-01-31T16:14:35+05:30 IST

వరంగల్‌ రూరల్‌ జిల్లా గొర్రెకుంట శివారులోని కట్టమల్లన్న చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వరంగల్‌ 11వ డివిజన్‌ క్రిస్టియన్‌కాలనీకి చెందిన బరిగెల రుచిత(7),

చెరువులో పడి ముగ్గురు విద్యార్థుల మృతి

గీసుగొండ, జనవరి 30: వరంగల్‌ రూరల్‌ జిల్లా గొర్రెకుంట శివారులోని కట్టమల్లన్న చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వరంగల్‌ 11వ డివిజన్‌ క్రిస్టియన్‌కాలనీకి చెందిన బరిగెల రుచిత(7), ప్రణయ్‌పాల్‌(9), రణధీర్‌(11) గురువారం చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయారు. గమనించిన స్థానికులు వారిని బయటికి తీయగా అప్పటికే ముగ్గురూ చనిపోయారు. వారి కుటుంబీకులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు.

Updated Date - 2020-01-31T16:14:35+05:30 IST