టెన్త్ పరీక్షల గ్రేడింగ్, సమయాల్లో సవరణలు
ABN , First Publish Date - 2020-01-10T15:45:13+05:30 IST
పదో తరగతి పబ్లిక్ పరీక్షల గ్రేడింగ్, సమయాల్లో సవరణలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈసారి మార్కుల మెమోల్లో సబ్జెక్టు వారీగా, పేపర్

అమరావతి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్ పరీక్షల గ్రేడింగ్, సమయాల్లో సవరణలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈసారి మార్కుల మెమోల్లో సబ్జెక్టు వారీగా, పేపర్ వారీగా గ్రేడ్లు ఇస్తారు. ఓఎ్‌సఎ్‌ససీ మెయిన్ లాంగ్వేజీ విషయానికి వస్తే .. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు పేపర్-1కు 3 గంటలకు బదులుగా 3.15 గంటల సమయం ఇస్తారు. పేపర్-2లో 1.45 గంటల సమయం ఇస్తారు. సెకండ్ లాంగ్వేజ్‌కు కూడా 3.15 గంటల సమయం ఇస్తారు.