మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌లో భాష్యం ప్రతిభ

ABN , First Publish Date - 2020-01-31T15:49:59+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ మ్యా థ్స్‌ ఒలింపియాడ్‌ (ఎపీఏఎంటీ) ఆధ్వర్యంలో గతేడాది నవంబర్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక 47వ ఒలింపియాడ్‌లో భాష్యం ఐఐటీ విద్యార్థులు అద్భుత ప్రతిభ

మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌లో భాష్యం ప్రతిభ

గుంటూరు(విద్య), జనవరి 30: ఆంధ్రప్రదేశ్‌ మ్యా థ్స్‌ ఒలింపియాడ్‌ (ఎపీఏఎంటీ) ఆధ్వర్యంలో గతేడాది నవంబర్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక 47వ ఒలింపియాడ్‌లో భాష్యం ఐఐటీ విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపారని సంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ విద్యార్థులు సీనియర్‌, జూనియర్‌ విభాగాల్లో రాష్ట్రస్థాయిలో 1, 2, 3 ర్యాంకులు సాధించారని తెలిపారు. భాష్యం ఒలింపియాడ్‌ పరీక్షల కోసం పాఠశాల స్థాయి నుంచే ప్రత్యేక శిక్షణ అందిస్తామని, ఫలితంగా పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణిస్తున్నారని వెల్లడించారు.

Updated Date - 2020-01-31T15:49:59+05:30 IST