ఆ ఉన్నతోద్యోగుల పదవీ కాలం పొడిగించొద్దు

ABN , First Publish Date - 2020-01-31T16:07:39+05:30 IST

తెలంగాణ అర్థ గణాంక శాఖలో పదవీ విరమణ చేయనున్న ఆ శాఖ డైరెక్టర్‌, ఇతర ఉన్నతోద్యోగులకు పదవీ కాలాన్ని పొడిగించవద్దని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ కారెం రవీందర్‌ రెడ్డి, సెక్రటరీ జనరల్‌ వి.మమత వినతి పత్రాన్ని

ఆ ఉన్నతోద్యోగుల పదవీ కాలం పొడిగించొద్దు

సీఎస్‌కు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విజ్ఞప్తి
హైదరాబాద్: తెలంగాణ అర్థ గణాంక శాఖలో పదవీ విరమణ చేయనున్న ఆ శాఖ డైరెక్టర్‌, ఇతర ఉన్నతోద్యోగులకు పదవీ కాలాన్ని పొడిగించవద్దని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ కారెం రవీందర్‌ రెడ్డి, సెక్రటరీ జనరల్‌ వి.మమత వినతి పత్రాన్ని అందజేశారు. వారికి పదవీ కాలం పొడిగిస్తే కింది స్థాయి ఉద్యోగులు పదోన్నతి పొందరని, అందువల్ల పదవీ కాలం పొడిగింపు దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవద్దంటూ సీఎ్‌సను కోరామని చైర్మన్‌, సెక్రటరీ జనరల్‌ తెలిపారు.

Updated Date - 2020-01-31T16:07:39+05:30 IST