నిరుద్యోగ యువతకి శుభవార్త

ABN , First Publish Date - 2020-01-10T16:27:10+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో డిగ్రీ పాస్‌ లేదా ఫెయిల్‌ అయిన నిరుద్యోగ యువతకు టెక్‌ ఫౌండేషన్‌, హెచ్‌సీహెచ్‌డబ్ల్యూ సంస్థల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా కా ర్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

నిరుద్యోగ యువతకి శుభవార్త

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో డిగ్రీ పాస్‌ లేదా ఫెయిల్‌ అయిన నిరుద్యోగ యువతకు టెక్‌ ఫౌండేషన్‌, హెచ్‌సీహెచ్‌డబ్ల్యూ సంస్థల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా కా ర్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణలో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, కంప్యూటర్‌ బేసిక్స్‌, ఎంఎస్‌ ఆఫీస్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఇంగిషు తదితర అంశాల్లో నాలుగు నెలల పాటు శిక్షణ ఇచ్చి అనంతరం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు సంస్థ నిర్వాహకులు అజిత్‌కుమార్‌, నారాయణ తెలిపారు. 30 ఏళ్లలోపు వయస్సున్న నిరుద్యోగులు జనవరి 13లోపు లక్డీకపూల్‌లోని తారామండల్‌ ఆఫీస్‌ కార్యాలయంలో ఫ్లాట్‌ నెంబర్‌ 511లో బయోడేటాను ఇవ్వాలని సూచించారు. వివరాలకు 9100689590, 9100689560 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

Read more