బ్యాంకులకు ‘అమ్మఒడి’ ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2020-01-14T15:56:08+05:30 IST

ఓ వైపు సంక్రాంతి అవసరాలు, మరోవైపు అమ్మఒడి లబ్ధిదారుల తాకిడితో సోమవారం బ్యాంకులు, ఏటీఎం కౌంటర్లు జనంతో కిటకిటలాడాయి. పలు బ్యాంకుల్లో నగదు నిల్వలు తక్కువగా ఉండటంతో అడిగిన మొత్తం ఇవ్వలేని పరిస్థితి

బ్యాంకులకు ‘అమ్మఒడి’ ఎఫెక్ట్‌

లబ్ధిదారులతో కిటకిట
 
నెల్లూరు(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఓ వైపు సంక్రాంతి అవసరాలు, మరోవైపు అమ్మఒడి లబ్ధిదారుల తాకిడితో సోమవారం బ్యాంకులు, ఏటీఎం కౌంటర్లు జనంతో కిటకిటలాడాయి. పలు బ్యాంకుల్లో నగదు నిల్వలు తక్కువగా ఉండటంతో అడిగిన మొత్తం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ నెల 9వ తేదీ నుంచి అమ్మఒడి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతున్న విషయం తెలిసిందే. ఆ తరువాత వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో లబ్ధిదారులు నగదు విత్‌ డ్రా చేసుకోలేకపోయారు.
 
దీంతో సోమవారం పెద్ద సంఖ్యలో బ్యాంకుల వద్ద బారులు తీరారు. ఖాతాదారుల తాకిడి ఎక్కువ కావడంతో గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని బ్యాంకుల్లో నగదు కొరత ఏర్పడింది. దీంతో డిపాజిటుదారులు కోరిన మొత్తం ఇవ్వలేక అందులో సగం మాత్రమే ఇచ్చారు. అమ్మఒడి లబ్దిదారులకు అక్కడక్కడ మరి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. పాన్‌కార్డు లేని వారికి నగదు ఇవ్వడానికి బ్యాంకుర్లు అంగీకరించలేదు. ఇంకొన్ని చోట్ల పాత అప్పులకు అమ్మఒడి నగదును జమ చేసుకునే ప్రయత్నాలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. బ్యాంకులకుతోడు ఏటీఎం కౌంటర్లు సోమవారం కిటకిటలాడాయి. సంక్రాంతి పండుగ అవసరాల కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఏటీఎం కౌంటర్లను ఆశ్రయించారు. దీంతో ుధ్యాహ్నానికే ఖాళీ అయ్యాయి.

Updated Date - 2020-01-14T15:56:08+05:30 IST