ఎంబీబీఎస్‌లో ఐదేళ్లకు ఫీజులు అహేతుకం!

ABN , First Publish Date - 2020-01-11T16:57:57+05:30 IST

తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ(టీఏఎ్‌ఫఆర్సీ) తీరును హైకోర్టు తప్పుబట్టింది. టిఏఎ్‌ఫఆర్సీ తీరు విద్యార్థుల పక్షాన కాకుండా ప్రైవేటు మెడికల్‌ కాలేజీల పక్షాన వకాల్తా పుచ్చుకున్నట్లుందని ఆక్షేపించింది. భారత వైద్య మండలి రూపొందించి న గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేషన్స్‌లోని 7(1)వ నిబంధన ప్రకారం ఎంబీబీఎస్‌ కోర్సు వ్యవధిని

ఎంబీబీఎస్‌లో ఐదేళ్లకు ఫీజులు అహేతుకం!

నాలుగున్నరేళ్లకే వసూలు చేయాలి..
టీఏఎఫ్ ఆర్సీ తీరును తప్పుబట్టిన హైకోర్టు
 
హైదరాబాద్‌, జనవరి 10(ఆంధ్రజ్యోతి): తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ(టీఏఎ్‌ఫఆర్సీ) తీరును హైకోర్టు తప్పుబట్టింది. టిఏఎ్‌ఫఆర్సీ తీరు విద్యార్థుల పక్షాన కాకుండా ప్రైవేటు మెడికల్‌ కాలేజీల పక్షాన వకాల్తా పుచ్చుకున్నట్లుందని ఆక్షేపించింది. భారత వైద్య మండలి రూపొందించి న గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేషన్స్‌లోని 7(1)వ నిబంధన ప్రకారం ఎంబీబీఎస్‌ కోర్సు వ్యవధిని నాలుగున్నరేళ్లుగా నిర్ణయించిందని స్పష్టం చేసింది. అందుకు విరుద్ధంగా విద్యార్థుల నుంచి ఐదేళ్లకు వార్షిక ఫీజు వసూలు చేసుకోవడానికి టిఏఎ్‌ఫఆర్సీ అనుమతించడం సహేతుకంగా లేదని తేల్చిచెప్పింది. టిఏఎ్‌ఫఆర్సీ నిర్దేశించిన వార్షిక ఫీజును నాలుగేళ్లు పూర్తి ఫీజు, ఐదో ఏడాదిలో 6 నెలలకు వార్షిక ఫీజులో సగం మాత్రమే వసూలు చేయాలని పేర్కొంది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ కె. లక్ష్మణ్‌ల ధర్మాసనం ఇటీవల ఆదేశాలిచ్చింది. హన్మకొండకు చెందిన విద్యార్థిని ఐ. పద్మతేజ 2018లో దాఖలు చేసిన వ్యా జ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సులకు సంబంధించి కౌన్సెలింగ్‌కు, ఏ, బీ, సీ కేటగిరీల్లో ఒక్కొక్క దానికి ఒక్కో విధంగా దరఖాస్తు, కౌన్సెలింగ్‌ ఫీజు, నాలుగున్నరేళ్ల కోర్సుకు 5 ఏళ్ల పూర్తి ఫీజు వసూలు చేయడాన్ని ఆమె ప్రశ్నించారు.
అంతా ఫెయిలవుతారని ఎందుకనుకోవాలి?
పిటిషనర్‌ రాష్ట్రంలోని ఏ వైద్య కళాశాలలోనూ విద్యార్థి కానందున ఆమెకు రిట్‌ దాఖలు చేసే అర్హత లేదని టీఏఎ్‌ఫఆర్సీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. 2018లో ఎంబీబీఎస్‌ ‘ఏ’ కేటగిరి సీటుకోసం పిటిషనర్‌ దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. సీటు పొం దలేక పోయారని, అయితే అడ్మిషన్‌ ప్రక్రియలోని లోపాలను ఎత్తిచూపే ప్రయత్నాన్ని తప్పుబట్టలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎంబీబీఎస్‌ కోర్సు నాలుగున్నరేళ్లే అయినప్పటికీ.. ఇంటర్నల్‌ అసె్‌సమెంట్స్‌లో 35ు మార్కులు రాని విద్యార్థులను అనర్హులుగా ప్రకటించి వారికి ఉచితంగా ప్రత్యేక శిక్షణను ఇవ్వాల్సి ఉంటుందని, అంచేత ఎంబీబీఎస్‌ కోర్సుకు 5 ఏళ్లకు పూర్తి ఫీజు వసూలు చేయడం సమర్థనీయమేనని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. వీటిరి ధర్మాసనం తిరస్కరించింది. విద్యార్థులందరూ మొదటి సంవత్సరం, లేదా రెండో ఏడాదిలో ఫెయిలవుతారని భావించడం సరికాదని, ఐదే ళ్లకు ఫీజులు వసూలు చేయడం సబబు కాదని తేల్చిచెప్పింది.

Updated Date - 2020-01-11T16:57:57+05:30 IST