సీఏ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్‌ విజయభేరి

ABN , First Publish Date - 2020-02-05T14:12:58+05:30 IST

సీఏ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్‌ విజయభేరి

సీఏ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్‌ విజయభేరి

గుంటూరు(విద్య), ఫిబ్రవరి 4: ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన సీఏ ఫౌండేషన్‌, సీఏ ఇంటర్‌ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్‌ విద్యార్థులు విజయభేరి మోగించారని సంస్థ పరిపాలన సలహాదారు మట్టుపల్లి మోహన్‌ మంగళవారం వెల్లడించారు. జాతీయ స్థాయిలో తమ విద్యార్థులు మొదటి 50 ర్యాంకుల్లో 18 ర్యాంకులు సాధించారని తెలిపారు. తమ విద్యార్థులు బి.ఈరేష్‌ 28వ ర్యాంకు, సిహెచ్‌.అనురాధ 34, ఆర్‌.తనయ్‌నాయుడు 38, ఆర్‌.అనూష 40, షేక్‌ ఇస్మాయిల్‌ 41, కొల్లా వెంకటసాయి 43, పి.ప్రవంత్‌ 43, టి.హరికృష్ణ, ప్రణతిరెడ్డి 45, దేవరపల్లి వినయ్‌, జి విశ్వనాథ్‌ 49, కె.హరిప్రియ, ఎం.త్రివేణి, కె.హర్షవర్ధని, బి.గంగాధరరెడ్డి 50వ ర్యాంకు సాధించినట్లు ఆయన వెల్లడించారు. అదే విధంగా సీఏ ఇంటర్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు 2 వేల మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఇందులో కె.అఖిల జాతీయ స్థాయిలో 18వ ర్యాంకు, జి.సునీల్‌ 35వ ర్యాంకు సాధించినట్లు చెప్పారు.

Read more