బీసీ గురుకులాల్లో 1900 పోస్టుల భర్తీ
ABN , First Publish Date - 2020-02-05T14:09:11+05:30 IST
బీసీ గురుకులాల్లో 1900 పోస్టుల భర్తీ

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): బీసీ గురుకుల విద్యా సంస్థల్లో 1900 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో అత్యధికంగా 1071 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. మిగతా వాటిలో 119 లైబ్రేరియన్స్, 119 ఆర్ట్స్, క్రాప్ట్, మ్యూజిక్ టీచర్స్, 119 జూనియర్ అసిస్టెంట్స్, 119 పీఈటీలు, 80 పీజీటీలు, 70 ఫిజికల్ డైరెక్టర్లు, 119 స్టాఫ్‌నర్సులు, 36 ప్రిన్సిపాల్స్, ఇతర పోస్టులు 48 వరకు ఉన్నాయని విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ అధికారులు తెలిపారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా 1900 పోస్టులు భర్తీ చేస్తామని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, 6,7,8 తరగతుల్లో ప్రవేశాల కోసం బీసీ గురుకుల విద్యా సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 29లోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, మార్చి 15న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపింది.