తప్పులు లేకుండా ఇంటర్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2020-01-08T18:00:24+05:30 IST

గత ఏడాది ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళం నేపథ్యంలో ఈ సారి సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టిసారించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. ఇంటర్‌ విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణకు రూపొందించిన బీఐజీఆర్‌ఎస్‌ వెబ్‌సైట్‌ను మంగళవారం ఆయన ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ప్రారంభించారు.

తప్పులు లేకుండా ఇంటర్‌ పరీక్షలు

గత ఏడాది తప్పులపై బుక్‌లెట్‌, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌
ఇంటర్‌బోర్డు గ్రీవెన్స్‌ వెబ్‌సైట్‌ ప్రారంభోత్సవంలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌
 
హైదరాబాద్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): గత ఏడాది ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళం నేపథ్యంలో ఈ సారి సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టిసారించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. ఇంటర్‌ విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణకు రూపొందించిన బీఐజీఆర్‌ఎస్‌ వెబ్‌సైట్‌ను మంగళవారం ఆయన ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇంటర్‌ పరీక్షలను ఎంత సీరియ్‌సగా తీసుకుంటోందో చెప్పడానికి.. సీఎస్‌ హోదాలో తాను ఇంటర్‌బోర్డుకు రావడమే నిదర్శనమన్నారు. త్రిసభ్య కమిటీ చేసిన సూచనలన్నింటినీ అమలు చేసినట్లు తెలిపారు. 0.001% కూడా తప్పులు లేకుండా జీరో టాలరెన్స్‌తో పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇక గత ఏడాది ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగాయో వాటిని ప్రత్యేంగా బుక్‌లెట్‌గా వేయడంతో పాటు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ కూడా రూపొందిస్తామన్నారు. వీటి ద్వారా జవాబు పత్రాలు మూల్యాంకనం చేసే లెక్చరర్లకు శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
 
తద్వారా మూల్యాంకనంలో తప్పులు జరుగకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు. మూల్యాంకనంలో తప్పులు చేస్తే.. సదరు లెక్చరర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎవాల్యుయేటర్స్‌ మార్కులు వేసేందుకు బబ్లింగ్‌తో పాటు ఇతర ప్రత్యామ్నాయ అవకాశాలను కూడా ఓఎంఆర్‌లో చేర్చుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, సీజీజీ డీజీ రాజేంద్ర నిమ్జే, ఇంటర్‌ బోర్డు సెక్రెటరీ ఉమర్‌ అబ్దుల్‌ తదితరులు పాల్గొన్నారు.
బీఐజీఆర్‌ఎ్‌సకు ఫిర్యాదు చేయడం ఇలా..
ఇంటర్‌ విద్యార్థులకు ఎలాంటి సమస్య ఎదురైనా www.bigrs.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. సమస్య స్వభావాన్ని బట్టి ఆ ఫిర్యాదు సంబంధిత అధికారులకు చేరుతుంది. సమస్య పరిష్కారమైతే విద్యార్థి మొబైల్‌కు మెసేజ్‌ను పంపిస్తారు. అదేవిధంగా సమస్య పరిష్కారం ఏ దశలో ఉందో..? ఏ అధికారి వద్ద పెండింగ్‌లో ఉందో..? తెలుసుకునే వీలు కూడా విద్యార్థులకు ఉంటుంది.

Updated Date - 2020-01-08T18:00:24+05:30 IST