పోలీసు కొలువులకు 100 మంది అనర్హులు..!

ABN , First Publish Date - 2020-01-31T16:09:53+05:30 IST

శిక్షణకు ఎంపికైన కానిస్టేబుల్‌ అభ్యర్ధుల్లో 100 మంది పోలీసు కొలువుకు అనర్హులయ్యారు. 16 వేలకుపైగా అభ్యర్ధులు పోలీసు కానిస్టేబుల్‌ శిక్షణకు ఎంపికవ్వగా.. వారిలో 400 మందికి క్రిమినల్‌ రికార్డు

పోలీసు కొలువులకు 100 మంది అనర్హులు..!

హైదరాబాద్: శిక్షణకు ఎంపికైన కానిస్టేబుల్‌ అభ్యర్ధుల్లో 100 మంది పోలీసు కొలువుకు అనర్హులయ్యారు. 16 వేలకుపైగా అభ్యర్ధులు పోలీసు కానిస్టేబుల్‌ శిక్షణకు ఎంపికవ్వగా.. వారిలో 400 మందికి క్రిమినల్‌ రికార్డు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారిని శిక్షణకు పంపించకుండా పక్కనబెట్టారు. వీటిల్లో.. కేసులు వీగిపోయినవారు, చిన్నాచితకా కేసులతో ప్రమేయం ఉన్న 300 మందిని శిక్షణకు పంపాలని నిర్ణయించారు. మిగతా 100 మందిపై తీవ్రమైన కేసులు ఉన్నట్లు గుర్తించి, శిక్షణకు అనర్హులుగా తేల్చారు.

Updated Date - 2020-01-31T16:09:53+05:30 IST