ముథోల్‌లో ఒకటో తరగతి చిన్నారికి వాతలు
ABN , First Publish Date - 2020-02-05T14:07:52+05:30 IST
ముథోల్‌లో ఒకటో తరగతి చిన్నారికి వాతలు

- హుజూరాబాద్‌లో విద్యార్థి కంటిపై తీవ్ర గాయం
ముథోల్/హుజూరాబాద్ టౌన్, ఫిబ్రవరి 4: ఉపాధ్యాయులు కొట్టడంతో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. నిర్మల్ జిల్లా ముథోల్ మండలం కారేగాం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న పవన్‌ను బడిలో ప్రైవేటుగా విధులు నిర్వహిస్తున్న నాగభూషణ్ అనే ఉపాధ్యాయుడు విచక్షణారహితంగా చితకబాదాడు. దీంతో చిన్నారి వీపులో వాతలు తేలాయి. దీనిపై అతడి కుటుంబసభ్యులు మంగళవారం ఉపాధ్యాయుడిని నిలదీశారు. కాగా, ఆ టీచర్‌ను విధుల నుంచి తొలగించనున్నట్లు హెచ్‌ఎం తెలిపారు. అల్లరి చేస్తున్నాడని ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు కుర్చీతో తలపై మోదడంతో తీవ్ర గాయమైంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థి కడారి దినేశ్ అల్లరి చేస్తున్నాడని ఉపాధ్యాయుడు రవీందర్ ప్లాస్టిక్ కుర్చీతో తలపై కొట్టాడు. దీంతో దినేశ్ కనుబొమ్మపై తీవ్ర గాయమైంది. విద్యార్థిని చికిత్స నిమిత్తం వరంగల్‌కు తరలించారు.