యువతకు ప్రపంచస్థాయి నైపుణ్య శిక్షణ

ABN , First Publish Date - 2020-02-05T14:14:46+05:30 IST

యువతకు ప్రపంచస్థాయి నైపుణ్య శిక్షణ

యువతకు ప్రపంచస్థాయి నైపుణ్య శిక్షణ

  • ఏపీఎన్‌ఆర్‌టీఎ్‌స అధ్యక్షుడు వెంకట్‌
విజయవాడ(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగుసొసైటీ.. ప్రవాసాంధ్రులకు సేవలు అందించడంతో పాటు యువతకు ప్రపంచస్థాయి నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉద్యోగ నియామకాలు కల్పిస్తోందని ఏపీఎన్‌ఆర్‌టీఎస్ అధ్యక్షుడు మేడపాటి వెంకట్‌ తెలిపారు. ఏపీఎన్‌ఆర్‌టీఎస్ ఆధ్వర్యంలో గుంటూరులోని అంతర్జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థలో యువతకు శిక్షణ ఇస్తున్నారు. మొదటి బ్యాచ్‌లో శిక్షణ పొందిన 12మందికి ఖతార్‌లోని ఏజే ట్రేడింగ్‌ అండ్‌ కాంట్రాక్టింగ్‌ డబ్ల్యూఎల్‌ కంపెనీలో ఉద్యోగాలు లభించాయి. వీరంతా మంగళవారం ఏపీఎన్‌ఆర్‌టీఎస్ అధ్యక్షుడు వెంకట్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

Read more