సైన్స్‌ ఒలింపియాడ్‌లో ‘నారాయణ’ సత్తా

ABN , First Publish Date - 2020-01-01T12:52:40+05:30 IST

సైన్స్‌ ఒలింపియాడ్‌లో ‘నారాయణ’ సత్తా

సైన్స్‌ ఒలింపియాడ్‌లో ‘నారాయణ’ సత్తా

హైదరాబాద్‌, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి) : సైన్స్‌ ఒలింపియాడ్‌ ఫౌండేషన్‌ జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్‌ సైన్స్‌ ఒలింపియాడ్‌లో నారాయణ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని నారాయణ విద్యా సంస్థల ఎండీ సింధూర నారాయణ తెలిపారు. 3, 4, 6వ తరగతుల్లో ఇంటర్నేషనల్‌ ఫస్ట్‌ ర్యాంకులు కైవసం చేసుకున్నారని తెలిపారు. అదేవిధంగా రెండో దశకు ఎంపికైన నారాయణ విద్యార్థుల్లో అంతర్జాతీయ స్థాయిలో 100 లోపు ర్యాంకు సాధించిన వారు 2,837 (35.8శాతం) మంది ఉండగా రాష్ట్ర స్థాయిలో 100 లోపు ర్యాంకు సాధించిన విద్యార్థులు 4444 (56.1శాతం) మంది ఉన్నారని పేర్కొన్నారు. ఒలింపియాడ్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయులకు సింధూర అభినందనలు తెలిపారు.

Updated Date - 2020-01-01T12:52:40+05:30 IST