నిరక్షరాస్యుల జాబితా సిద్ధం చేయండి

ABN , First Publish Date - 2020-01-02T14:41:08+05:30 IST

నిరక్షరాస్యుల జాబితా సిద్ధం చేయండి

నిరక్షరాస్యుల జాబితా సిద్ధం చేయండి

  • పల్లె ప్రగతి-2 కోసం సీఎస్‌ సోమేశ్‌ ఆదేశాలు
హైదరాబాద్‌, జనవరి 1(ఆంధ్రజ్యోతి): చదవడం, రాయడం రాని 18 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యుల జాబితాను సిద్ధం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం ప్రారంభం కానున్న పల్లె ప్రగతి రెండో విడత నేపథ్యంలో ఈ నెల 10లోగా నిరక్షరాస్యుల జాబితా సిద్ధం చేయాలన్నారు. కల్లెక్టర్లతో ఆయన బుధవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వయోజనుల అక్షరాస్యతను పెంపొందించడానికి ప్రత్యేకంగా క్యాంపెయిన్‌ నిర్వహించాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో అక్షరాస్యత పెంపు కోసం ‘ఈచ్‌ వన్‌, టీచ్‌ వన్‌’ నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని చెప్పారు.

Updated Date - 2020-01-02T14:41:08+05:30 IST