తీవ్రమైన నేరాల్లో ప్రమేయం ఉంటే.. పోలీసు శిక్షణకు అనర్హులే

ABN , First Publish Date - 2020-01-17T15:56:14+05:30 IST

నేర చరిత్ర ఉన్న కానిస్టేబుల్‌ అభ్యర్థులను శిక్షణకు పంపాలా? వద్దా? అనే అంశంపై నియామక మండలి ఏర్పాటు చేసిన కమిటీ స్పష్టతనిచ్చింది. తీవ్రమైన నేరాల్లో ప్రమేయం

తీవ్రమైన నేరాల్లో ప్రమేయం ఉంటే.. పోలీసు శిక్షణకు అనర్హులే

సాధారణ కేసులుంటే ఆమోదం
 
 నేటి నుంచి కానిస్టేబుళ్లకు శిక్షణ
 
హైదరాబాద్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): నేర చరిత్ర ఉన్న కానిస్టేబుల్‌ అభ్యర్థులను శిక్షణకు పంపాలా? వద్దా? అనే అంశంపై నియామక మండలి ఏర్పాటు చేసిన కమిటీ స్పష్టతనిచ్చింది. తీవ్రమైన నేరాల్లో ప్రమేయం ఉన్నవారిని శిక్షణకు అనర్హులుగా పరిగణించాలని, చిన్నాచితకా, సాధారణ కేసులున్నవారిని మినహాయించాలని సూచించింది. ఇటీవల కానిస్టేబుల్‌ శిక్షణకు ఎంపికైన వారి నేర చరిత్రను నియామక మండలి అధికారులు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో పరిశీలించింది. ఈ క్రమంలో 300 మందికి నేరచరిత్ర ఉందని గుర్తించారు. వీరి విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ఉన్నతాధికారులు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కాగా.. శుక్రవారం నుంచి కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం కానుంది.

Updated Date - 2020-01-17T15:56:14+05:30 IST