క్షుద్రపూజలు చేసిన ఉపాధ్యాయురాలి సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-01-18T15:54:32+05:30 IST

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం శంభునిపల్లి ప్రాథమిక పాఠశాలలో క్షుద్రపూజలు నిర్వహించిన ఉపాధ్యాయురాలు పసుపులేటి సునీతను సస్పెండ్‌

క్షుద్రపూజలు చేసిన ఉపాధ్యాయురాలి సస్పెన్షన్‌

వరంగల్‌ అర్బన్‌ ఎడ్యుకేషన్‌, జనవరి 17: వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం శంభునిపల్లి ప్రాథమిక పాఠశాలలో క్షుద్రపూజలు నిర్వహించిన ఉపాధ్యాయురాలు పసుపులేటి సునీతను సస్పెండ్‌ చేసినట్లు డీఈవో కె. నారాయణరెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ నెల 10న సునీత క్షుద్రపూజలు చేయించారు. 11న పోలీసులు సునీతతో పాటు భూత వైద్యుడు కుమార్‌లను అరెస్టు చేశారు. మండల విద్యాధికారితో సమగ్ర విచారణ జరిపించిన డీఈవో నారాయణ శనివారం సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2020-01-18T15:54:32+05:30 IST