గీతం ఎంబీఏ, బీబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-01-02T14:46:43+05:30 IST

గీతం ఎంబీఏ, బీబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

గీతం ఎంబీఏ, బీబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

  • 25న జాతీయ స్థాయి ఆన్‌లైన్‌ పరీక్ష
విశాఖ/సాగర్‌నగర్‌: గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహిస్తున్న ఎంబీఏ, బీబీఏ, బీకామ్‌, ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ కోర్సులలో 2020 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు జనవరి 25న ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నట్టు ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వై.గౌతమ్‌రావు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు పెద్దఎత్తున దరఖాస్తుచేసుకుంటుండడంతో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌, అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రవేశాలకు వేర్వేరుగా ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. యూజీ, పీజీ కోర్సులకు జనవరి 25న ఆన్‌లైన్‌లో ప్రవేశపరీక్ష ఉంటుందన్నారు. దీనికి ఈనెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. గీతం మేనేజ్‌మెంట్‌ కోర్సులలో ప్రవేశానికి సంబంధించి అర్హతలు, ఫీజుల వివరాలు ఆన్‌లైన్‌ దరఖాస్తులకు వెబ్‌సైట్‌ డబ్ల్యుడబ్య్లు.గీతం.ఈడీయూను పరిశీలించాలని సూచించారు.

Updated Date - 2020-01-02T14:46:43+05:30 IST