గాలి లేని చోట
ABN , First Publish Date - 2020-08-10T11:01:53+05:30 IST
మనుషులంతా బొమ్మలైపోతారు విశాలమైన స్థలాలు ఉక్కపోతతో ఉడికుడికిపోతాయి బాధంతా ఓ చోట కుప్పపడి...
మనుషులంతా బొమ్మలైపోతారు
విశాలమైన స్థలాలు ఉక్కపోతతో
ఉడికుడికిపోతాయి
బాధంతా ఓ చోట కుప్పపడి
ఎటుపడితే అటు కారిపోతుంది
ఆక్సిజన్ నా ఖరీదు పెరిగిపోతుందని
గల్లా ఎగరేస్తుంది
ఆశీస్సులిచ్చేవాడు, తీసుకునేవాడు
ఇద్దరూ ఉండరు
వణుకుతున్న చేతులు
సహాయం కోసం పైకి లేస్తాయి
రహస్యాలు చెవులను తాకకుండా
దూరమెళ్ళిపోతాయి
ప్రార్థనలకిక చోటుండదు
యాత్ర ఇక కొనసాగదు
గాలిలేని చోట
కొండలకు కూడా ఊపిరాడదు
తండ హరిష్ గౌడ్
89784 39551