కృష్ణానదీ జలసాధన దీక్ష

ABN , First Publish Date - 2020-06-16T05:47:34+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 203 జీవోతో పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టబోతున్నది. ఇదివరలో రాజోలిబండ కట్టను పాడుబెట్టి సుంకేశులను ఆధునీకరించి తుంగభద్రను మలిపినట్టుగా, ఇప్పుడు జూరాలను...

కృష్ణానదీ జలసాధన దీక్ష

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 203 జీవోతో పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టబోతున్నది. ఇదివరలో రాజోలిబండ కట్టను పాడుబెట్టి సుంకేశులను ఆధునీకరించి తుంగభద్రను మలిపినట్టుగా, ఇప్పుడు జూరాలను సిల్టుకు వదిలేసి పోతిరెడ్డిపాడును విస్తరిస్తారు, కృష్ణానదిని మలుపుతారు. సులభంగా మళ్ళని నీటిని రాయలసీమ ఎత్తిపోతలతో మలుపుతారు. ఇది జరిగితే తెలంగాణలో దక్షిణ తెలంగాణ, దక్షిణ తెలంగాణలో కూడా మహబూబ్‌నగర్‌, రంగారెడ్డిజిల్లాలు తీవ్రంగా నష్టపోతాయి. పరిస్థితి తెలిసినా ఈ జిల్లాలకు న్యాయం కోసం ప్రభుత్వం శ్రద్ధపెట్టడం లేదు. ఇతర పార్టీలు, నేతలు విస్తృత ప్రజా భాగస్వామ్యంతో ఉద్యమం నిర్మించడం లేదు. వీరందరిపై ఒత్తిడి పెంచడానికీ, ప్రజలకు వాస్తవాలు తెల్పటానికి నేడు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2వరకూ కరోనా సూచనలు పాటిస్తూనే ‘కృష్ణానదీ జలసాధన దీక్ష’ నిర్వహిద్దాం.


డిమాండ్లు: భీమా, కృష్ణా నదుల సంగమ స్థలం నుండి వరదనీరు జూరాలకు చేరేలోగా అనువైన స్థలంలో రోజుకు 5 టీఎంసీ నీరు తీసు కొనే విధంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టి ఎగువ ప్రాంతపు అన్ని నియోజకవర్గాల్లో రిజర్వాయర్లు నిర్మించి బీడు భూములకు నీరివ్వాలి. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా 1, బీమా 2, కోయిల్‌సాగర్‌ పథకాలను ౩0రోజులలో నీరు తీసుకొనే విధంగా అభివృద్ధిపరచాలి, అవసరమైన రిజర్వాయర్లు నిర్మించాలి. రాజోలి బండ మళ్ళింపు పథకాన్ని ఆధునీకరించి 15.9 టీఎంసి నీరు సాధించాలి. జూరాల ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచే అవకాశాల పరిశీలనకు నిపుణుల కమిటీ వేయాలి. అమ్రాబాద్‌, బల్మూరు, గట్టు హైలెవర్‌ ఎత్తిపోతల పథకాలు చేపట్టాలి. ఆయా ప్రాజెక్టుల పరిధిలో భూ నిర్వాసిత కుటుంబాలకు భూమి, ఉద్యోగాలు, ఇతర ప్రయోజనాలు కల్పించాలి.

పాలమూరు అధ్యయన వేదిక

Updated Date - 2020-06-16T05:47:34+05:30 IST