ఈ వారం సాహితి కార్యక్రమాలు

ABN , First Publish Date - 2020-03-02T07:29:47+05:30 IST

మహ్దూమ్‌ నేషనల్‌ అవార్డు కవి రాజు రచనలు కావాలి ‘కవీంద్రమోక్షం’ కవితా సంపుటి పెన్నా సాహిత్య పురస్కారం నాన్న కవితలకు ఆహ్వానం.

ఈ వారం సాహితి కార్యక్రమాలు

మహ్దూమ్‌ నేషనల్‌ అవార్డు

సిటీ కాలేజి మఖ్దూమ్‌ మొహియుద్దీన్‌ నేషనల్‌ అవార్డును సుద్దాల అశోక్‌ తేజ అందుకుంటారు. ప్రదానోత్సవ సభ మార్చి 4 ఉ.11గం.లకు గ్రేట్‌ హాల్‌, ప్రభుత్వ సిటీ కాలేజీ, హైదరాబాద్‌లో జరుగుతుంది. వి.విజయలక్ష్మి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, కోయి కోటేశ్వరరావు, విప్లవ్‌దత్‌ శుక్లా, యాకూబ్‌ పాల్గొంటారు. 

యాకూబ్‌


కవి రాజు రచనలు కావాలి

కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి సమ గ్ర సాహిత్య ప్రచురించే ప్రయత్నంలో ఉన్నా ము. మాకు లభ్యం కావలసిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి. 1912 ఆగస్టు 2న కృష్ణా పత్రికలో వెలువడిన ప్రకటన వల్ల వారి రచనలు ‘సం యుక్త’, ‘నేత్రావధాన చంద్రిక’, ‘మానసబోధ శతకము’ పుస్తకాల గురించి తెలిసింది. ఈ పుస్తకాలు మీ వద్ద ఉన్నా, లభ్య స్థానం తెలిసినా దయచేసి అనిల్‌ అట్లూరి, ఫోన్‌: 81426 42638కు తెలియజేయండి. 

అనిల్‌ అట్లూరి 


‘కవీంద్రమోక్షం’ కవితా సంపుటి

రఘుశ్రీ ‘కవీంద్ర మోక్షం’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ మార్చి 3 సా.6గం.లకు శ్రీత్యాగరాయ గానసభలో జరుగుతుంది. 

బండారుపల్లి రామచంద్రరావు


పెన్నా సాహిత్య పురస్కారం

పెన్నా సాహిత్య పురస్కారం 2020కు జనవరి 2019 నుంచి డిసెంబర్‌ 2019 వరకు ప్రచురితమైన కవితా సంపుటా లను ఆహ్వానిస్తున్నాం. మార్చి 31లోగా 4 కాపీలను చిరునామా: మోపూరు పెంచల నరసింహం, 23-1-57, పెండెం వారి వీధి, పత్తేఖాన్‌ పేట, నెల్లూరు- 524003కు పంపాలి. ఫోన్‌: 8500130770. 

మోపూరు పెంచల నరసింహం


నాన్న కవితలకు ఆహ్వానం

మా తండ్రి కొత్వాల్‌ ఆంజనేయులు స్మార కార్థం వేస్తున్న కవితా సంపుటి కోసం కవితలను మార్చి 31లోగా వాట్సాప్‌ నెం. 98668 63913కు పంపగోరుతున్నాం. 

భానుశ్రీ కొత్వాల్‌
Updated Date - 2020-03-02T07:29:47+05:30 IST