తపాలా ద్వారా లైఫ్ సర్టిఫికెట్లు

ABN , First Publish Date - 2020-12-15T09:33:59+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ప్రరిధిలోని పెన్షనర్లు జీవించి ఉన్నట్టు ధ్రువీకరించేందుకు ప్రతి ఏటా వారు తమ ‘జీవన ప్రమాణ్’ లేక ‘లైఫ్ సర్టిఫికెట్ల’ను ట్రెజరీ అధికారికి...

తపాలా ద్వారా లైఫ్ సర్టిఫికెట్లు

ఆంధ్రప్రదేశ్ ప్రరిధిలోని పెన్షనర్లు జీవించి ఉన్నట్టు ధ్రువీకరించేందుకు ప్రతి ఏటా వారు తమ ‘జీవన ప్రమాణ్’ లేక ‘లైఫ్ సర్టిఫికెట్ల’ను ట్రెజరీ అధికారికి సమర్పించే పద్ధతి ఇదివరకు ఉండేది. సాంకేతికత పెరిగిన తర్వాత పెన్షనర్ల బొటన వేలి ముద్రలు లేక కంటి ఐరిస్‌ ఆధారంగా ఈ ధ్రువీకరణ జరుగుతోంది. కానీ నేటి కరోనా మహమ్మారి కారణంగా ఇతర రాష్ట్రాలలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు సంబంధిత ట్రెజరీ కార్యాలయాలను వ్యక్తిగతంగా సందర్శించే పరిస్థితి లేదు. కాబట్టి మూడేళ్ళ క్రితం అమలు చేసిన తీరుగా పెన్షనర్లు తమ ‘లైఫ్ సర్టిఫికెట్ల’ ఫారాలను తాము నివసించే ప్రాంతంలోని (ఆంధ్ర గానీ, తెలంగాణ గానీ, ఏ ఇతర రాష్ట్రం గానీ) గెజిటెడ్ అధికారిచే సంతకం చేయించి, వాటిని తపాలా ద్వారా సంబంధిత జిల్లా ట్రెజరీ/ సబ్‌ ట్రెజరీ శాఖాధిపతులకు చేర్చే ప్రక్రియను మళ్ళీ అమల్లోకి తేవాలి. నేటి కరోనా విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, సంబంధిత అధికారులు తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము. ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహించి పదవీ విరమణ చేసి వృద్ధ్యాప్యంలో ఉన్న పౌరులకు ఇది సముచిత సాయం అవుతుంది. 

ఎగ్గోని శ్యామ సుందర్

మణికొండ, హైదరాబాద్

Updated Date - 2020-12-15T09:33:59+05:30 IST