సగమే గెలిచాం!

ABN , First Publish Date - 2020-05-13T09:05:19+05:30 IST

యజ్ఞంలా సాగింది లాక్‌డౌన్‌ దిగ్విజయంగా మన దేశమంతా ఇంకా జరుగుతూనే ఉంది కనపడని శత్రువుతో పోరాటం సుదీర్ఘమైన చీకటి దారిలో...

సగమే గెలిచాం!

యజ్ఞంలా సాగింది లాక్‌డౌన్‌ 

దిగ్విజయంగా మన దేశమంతా 


ఇంకా జరుగుతూనే ఉంది  

కనపడని శత్రువుతో పోరాటం

సుదీర్ఘమైన చీకటి దారిలో

మనం దాటింది సగం దూరమే 


భంగపాటుపడ్డ కరోనా

విరుచుకుపడగలదు భళ్ళున

ఏ క్షణాన్నైనా!

ఏకాస్త ఏమారుపాటైనా!


భయంతో దిక్కుతోచక

ఎన్నాళ్ళిలా ఉపేక్షిస్తావ్?

రక్షిస్తుంది కొత్త వాక్సిన్ అని 

ఎన్నేళ్ళని నిరీక్షిస్తావ్?


తాండవం చేస్తుంది దరిద్ర దేవత

జాప్యం చేస్తే పేదలు మరింత నిరుపేదలు


కొవిడ్ కాటుకి చిక్కక

ఒడుపుగా కదలటమే మందు


మూతికి మాస్కు– చేతికి గ్లోవ్సు

నెత్తికి టోపీ – కాలికి బూటు


ఎడమే మందు ఈ మాయదారి వైరస్‌కి మతిపోయి మరలిపోతుంది 

సొంత అడ్రసుకి!

దేవ్ అమర్

Read more