సి.పి. బ్రౌన్‌ సాహితీ సేవా పురస్కారం వేదగిరి రాంబాబు కథానికా పురస్కారం 2020

ABN , First Publish Date - 2020-09-21T09:29:03+05:30 IST

పాఠ పరిష్కరణ, కావ్యాలకు వ్యాఖ్య, నిఘంటు నిర్మాణం- ఈ రంగాలలో కృషి చేసినవారికి సి.పి. బ్రౌన్‌ సేవా సమితి (బెంగళూరు) 2020...

సి.పి. బ్రౌన్‌ సాహితీ సేవా పురస్కారం వేదగిరి రాంబాబు కథానికా పురస్కారం 2020

సి.పి. బ్రౌన్‌ సాహితీ సేవా పురస్కారం

పాఠ పరిష్కరణ, కావ్యాలకు వ్యాఖ్య, నిఘంటు నిర్మాణం- ఈ రంగాలలో కృషి చేసినవారికి సి.పి. బ్రౌన్‌ సేవా సమితి (బెంగళూరు) 2020 సంవత్సరం నుంచి ‘సి.పి. బ్రౌన్‌ సాహితీ సేవా పురస్కారం’ ఇవ్వదలచింది. సన్మానం, రూ.10వేల నగదు పురస్కారం ఉంటాయి. నియమాలు: 1) పదవీ విరమణ పొం దిన తరువాత పండితులు, సాహితీవేత్తలు చేసిన కృషి సి.పి. బ్రౌన్‌ సేవలకు అనుగుణంగా ఉండాలి. 2) వృత్తితో సంబంధం లేకుండా ప్రవృత్తిపరంగా తెలుగు భాషా సాహిత్యాలపై కృషి చేసి ఉండాలి. అభ్యర్థులు తమ కృషిని వివరిస్తూ, తమ వివరా లతో కూడిన సమాచారాన్ని అక్టోబర్‌ 20లోగా చిరునామా: I. Lakshmi Reddy, C/o, VISION PU College, No. 802, 9th B Main, HRBR Ist Block, Benga luru - 560 043. Karnataka (State) కు పంపాలి. వివరాలకు: 93425 40479. 

ఇడమకంటి లక్ష్మీరెడ్డివేదగిరి రాంబాబు కథానికా పురస్కారం 2020

వేదగిరి రాంబాబు కథానికా పురస్కారానికి 2020 సంవత్సరా నికిగాను ఎం.దేవేంద్ర (హైదరాబాద్‌) రాసిన ‘అడుగులు’ కథా సంపుటి ఎంపికైంది. శ్రీవిహారి న్యాయ నిర్ణేత. పురస్కారంగా రూ.5వేల నగదు, శాలువా, సత్కారం ఉంటాయి. అక్టోబర్‌ 14న జరిగే కార్యక్రమంలో పురస్కార ప్రదానం జరుగుతుంది. 

సింహప్రసాద్‌

Updated Date - 2020-09-21T09:29:03+05:30 IST