పరిశుభ్రతయే పరమాయుధం!

ABN , First Publish Date - 2020-03-28T09:09:48+05:30 IST

కరోనా రాక్షసిని కడతేర్చాలంటే పరిశుభ్రతయే పరమాయుధం! గజం గజం ఎడంగా గడపడమే నిజంగా అణగార్చే నిశ్చయమార్గం!

పరిశుభ్రతయే పరమాయుధం!

కరోనా రాక్షసిని కడతేర్చాలంటే

పరిశుభ్రతయే పరమాయుధం!

గజం గజం ఎడంగా గడపడమే

నిజంగా అణగార్చే నిశ్చయమార్గం!

కంటికి కనిపించనీ‘కరోనా’నే

అంటించుకు అంతటా తిరిగావో

తోటివారికందరికీ సోకే తరుణం

నిర్లక్ష్యం చేశావో తప్పదు మరణం!

అందుకే కనువిప్పుతో వెంటనే

‘కరోనా’ కట్టడికై ఇంట్లోనే

ఉంటేనే మారుమంచి ఆవరణం

అదే ప్రస్తుతం అందరికీ శరణం!

జీవకణాల ఆసరాగ వ్యాపించే

‘కరోనా’ను అంతం చేయాలంటే

ఒకరినొకరు అంటకుండ మెదలాలీ

రోగగ్రస్తులను తాకక మసలాలీ!

‘లాక్‌డౌన్‌’ కాలంలో సలక్షణంగా

ఇంటివద్ద వుండడమే ఇంగితజ్ఞానం

బైకుల్లో బయటపడి తిరగడమే

చెప్పిన వినకుండచెడే అజ్ఞానం!


వడ్డేపల్లి కృష్ణ

Updated Date - 2020-03-28T09:09:48+05:30 IST