కవచకుండలాలు

ABN , First Publish Date - 2020-10-07T06:03:01+05:30 IST

వాళ్ళ నాయనమ్మ వల్చుకుంది వాళ్ళ నాన్న కూడా వల్చుకుండు వాళ్ళమ్మకు సహజంగానే అవి లేవు...

కవచకుండలాలు

వాళ్ళ నాయనమ్మ వల్చుకుంది

వాళ్ళ నాన్న కూడా వల్చుకుండు

వాళ్ళమ్మకు సహజంగానే అవి లేవు

వాళ్ళు అవి లేకుండానే పుట్టారు

వాళ్ళది 4జి

అందుకే వాళ్ళు 

మిగిలిన మాంసపు ముద్దలను 

హత్తుకోగలిగారు

మోకరిల్లగలిగారు

తోలు ఎంత తెల్లదైనా

వాళ్లకు ఎన్ని మచ్చలున్నా

ఎన్ని మరకలున్నా

కవచకుండలాలు లేనివాళ్ళు కదా

ఆ స్పర్శ చాలు

వాళ్ళు హత్తుకున్నది.. ఒకరినో ఇద్దరినో కాదు

ఆసేతుహిమాచలపర్యంతం

చెమట రక్తం కన్నీళ్లతో ప్రవహిస్తూ, 

కవచకుండలాల

విషపువిసర్జనాల కలుషితమైన 

ఈ దేశపు జీవనగంగను!

ఇప్పుడు పుట్టాల్సింది కవచకుండలాలు లేనివాళ్లే

ఇప్పుడు ఉండాల్సింది

కవచకుండలాలు వలుచుకుని వచ్చే మనుషులే.

‘మట్టిమనిషి’ వేనేపల్లి పాండురంగారావు

Read more