మాతృభాషకే హైకోర్టు పట్టం

ABN , First Publish Date - 2020-04-18T06:36:21+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 81, 85 జీవోలు చట్టవిరుద్ధమైనవిగా కొట్టివేస్తూ 15న ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా మాతృ భాషా మాధ్యమాన్ని...

మాతృభాషకే హైకోర్టు పట్టం

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 81, 85 జీవోలు చట్టవిరుద్ధమైనవిగా కొట్టివేస్తూ 15న ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా మాతృ భాషా మాధ్యమాన్ని రద్దు పరుస్తూ పరాయి భాష అయిన ఆంగ్ల మాధ్యమంలో బోధన గరపటం అహేతుకం, అశాస్త్రీయం కూడా. తెలిసిన మాతృ భాష ద్వారా తెలియని పరాయి భాషను నేర్పటం శాస్త్రీయమైన పద్ధతి. కనుక, రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో కూడా మాతృభాషా మాధ్యమంలోనే చదువులు ఉండే విధంగా తగు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం.


– కొప్పల భానుమూర్తి, పి. పాండురంగ వరప్రసాద్,

దివి కుమార్, ఎన్.వి. రమణయ్య, అరసవిల్లి కృష్ణ

ప్రజా భాషల పరిరక్షణ వేదిక

Updated Date - 2020-04-18T06:36:21+05:30 IST