కరెన్సీ నోటుపై అంబేడ్కర్ ఫొటో
ABN , First Publish Date - 2020-11-25T06:05:30+05:30 IST
బ్రిటిష్ పరిపాలనలో రూపాయి విలువ పడిపోతున్నప్పుడు డా. అంబేడ్కర్ దానికి పరిష్కార మార్గాన్ని వెతికారు. సగటు వ్యక్తి సంక్షేమంతో పాటు...

బ్రిటిష్ పరిపాలనలో రూపాయి విలువ పడిపోతున్నప్పుడు డా. అంబేడ్కర్ దానికి పరిష్కార మార్గాన్ని వెతికారు. సగటు వ్యక్తి సంక్షేమంతో పాటు ఆర్థిక కోణాన్నీ దృష్టిలో ఉంచుకుని, రూపాయి విలువ సంరక్షణకు బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగులేని పోరాటం చేశారు. ఈ అంశంపై పలు పుస్తకాలను రాశారు. 1926 నుంచి 1949 వరకు డా. బిఆర్ అంబేడ్కర్ తన మేధాశక్తినంతా ధారపోసి రిజర్వుబ్యాంక్ చట్టాన్ని తీసుకురావటంకోసం ఎంతో కృషి చేశారు. ఆర్‌బిఐకు రూపకల్పన చేసింది అంబేడ్కర్ అయినప్పటికీ ఆయన ఫొటోను కరెన్సీ నోటుపై ఈనాటివరకూ ముద్రించలేదు. ఇప్పటికైనా ఆ మహానీయుడి ఫొటోను కరెన్సీ నోటుపై ముద్రించాలని కోరుతున్నాం. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేడ్కర్ చిత్రపటాన్ని పెట్టాలని, ఆయన విగ్రహాల ధ్వంసాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
కరెన్సీ నోటుపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలని కోరుతూ ఈ నెల 26వ తేదీ నుంచి ఏప్రిల్ 14, 2021న అంబేడ్కర్ జయంతి వరకు దేశవ్యాప్తంగా రెండో విడత ప్రజా చైతన్య రథయాత్రను నిర్వహిస్తున్నాం. తెలంగాణలో ఈ ప్రజా చైతన్య రథయాత్ర డిసెంబరు 11, 2020తో ముగింపుకు వస్తుంది. ముగింపు సభ ట్యాంక్‍బండ్, అంబేడ్కర్ విగ్రహం, హైదరాబాద్ వద్ద జరుగుతుంది.
జేరిపోతుల పరశురామ్
ఇండియన్ కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి