మద్యం దొరక్క యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-04-26T13:55:47+05:30 IST

మద్యానికి బానిసైన ఓ యువకుడు లాక్‌డౌన్‌ సందర్భంగా మద్యం దొరక్కపోవడంతో ఫ్యాన్‌కు

మద్యం దొరక్క యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్ : మద్యానికి బానిసైన ఓ యువకుడు లాక్‌డౌన్‌ సందర్భంగా మద్యం దొరక్కపోవడంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కాచిగూడ పీఎస్‌ పరిధిలో జరిగింది. నింబోలిఅడ్డాలో  ఉంటున్న విజయకుమార్‌ కుమారుడు సాయికుమార్‌(32) కోఠిలోని వస్త్ర దుకాణంలో పని చేస్తున్నాడు. గతంలో ప్రతి రోజూ మద్యం తాగేవాడు. నెల రోజులుగా మద్యం దొరక్కపోవడంతో సాయికుమార్‌ శనివారం ఇంట్లో ఎవరు లేనిసమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-04-26T13:55:47+05:30 IST