యువకుడు ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌లో ఎస్‌ఐ ప్రస్తావన

ABN , First Publish Date - 2020-12-28T13:54:59+05:30 IST

ప్రేమించిన అమ్మాయి నాన్న, ఓ ఎస్‌ఐ మందలించారని యువకుడు

యువకుడు ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌లో ఎస్‌ఐ ప్రస్తావన

హైదరాబాద్/చాంద్రాయణగుట్ట : ప్రేమించిన అమ్మాయి నాన్న, ఓ ఎస్‌ఐ మందలించారని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఛత్రినాక ఎస్‌ఐ సాయికుమార్‌ గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం... హనుమాన్‌నగర్‌కు చెందిన డి.మోహన్‌ (24) శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి 9-30 గంటలకు తల్లి ఇంటికి వచ్చి తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో స్థానికుల సాయంతో ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి మోహన్‌ ఉరేసుకుని కనిపించాడు. 


పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించగా మోహన్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ లభించింది. అందులో తాను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో వివాహమైందని, తనను ఆ అమ్మాయి నాన్న, ఓ ఎస్‌ఐ మందలించారని రాసి ఉంది. శాలిబండ ఎస్‌ఐను ఈ విషయమై వివరణ కోరగా మోహన్‌ గతంలో ఓ యువతిని ప్రేమించాడని, ఆ యువతి తల్లిదండ్రులు ఆమెకు వేరే యువకుడితో  పెళ్లి జరిపించారని తెలిపారు. ఆ యువతి సెప్టెంబర్‌ 12న ఆత్మహత్యాయత్నం చేయగా విచారణలో మోహన్‌ తనను వేధిస్తున్నాడని, ఈ విషయం తన భర్తకు తెలిసిందని, అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపిందని ఎస్‌ఐ పేర్కొన్నారు. దీంతో మోహన్‌ను పిలిపించి ఆమె జోలికి వెళ్ళవద్దని నచ్చజెప్పి పంపాను కానీ వేధింపులకు గురిచేయలేదని తెలిపారు.

Updated Date - 2020-12-28T13:54:59+05:30 IST