ప్రియుడికి మహిళల స్నానపు దృశ్యాలు

ABN , First Publish Date - 2020-12-17T08:08:29+05:30 IST

తోటి మహిళలు స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియోలు తీసి ప్రియుడికి పంపుతూ అడ్డంగా పట్టుబడిన నర్సు ఉదంతం బెంగళూరులో వెలుగుచూసింది.

ప్రియుడికి మహిళల స్నానపు దృశ్యాలు

 హాస్టల్‌ నుంచి మొబైల్‌ ద్వారా పంపిన నర్సు అరెస్టు 

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): తోటి మహిళలు స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియోలు తీసి ప్రియుడికి పంపుతూ అడ్డంగా పట్టుబడిన నర్సు ఉదంతం బెంగళూరులో వెలుగుచూసింది. వైట్‌ఫీల్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అశ్వని నర్సు పనిచేస్తూ.. ఓ హాస్టల్‌లో ఉంటోంది. ఈ నెల 5న సాయంత్రం ఓ మహిళ హాస్టల్లో స్నానం చేస్తున్న సమయంలో రహస్యంగా ఉంచిన మొబైల్‌ను గుర్తించారు.

అనుమానంతో మొబైల్‌ పరిశీలిస్తే వీడియో రికార్డు ఆన్‌లో ఉంది. మొబైల్‌ గ్యాలరీలో అదే హాస్టల్‌లో ఉంటున్న పలువురు స్నానం చేసే వీడియోలు కనిపించాయి. దీంతో హాస్టల్‌ మేనేజర్‌కు సమాచారం ఇవ్వడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నర్సును, ఆమె ప్రియుడు ప్రభు(31)ను అరెస్టు చేశారు.


Updated Date - 2020-12-17T08:08:29+05:30 IST