హత్రాస్ అత్యాచార బాధితురాలు ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

ABN , First Publish Date - 2020-09-29T15:17:44+05:30 IST

హత్రాస్ అత్యాచార బాధితురాలు ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది.

హత్రాస్ అత్యాచార బాధితురాలు ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

న్యూఢిల్లీ : హత్రాస్ అత్యాచార బాధితురాలు ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ పట్టణానికి చెందిన 20 ఏళ్ల ఎస్సీ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసి నాలుక కోసి హింసించారు. యువతి తన కుటుంబసభ్యులతో కలిసి గడ్డి కోస్తుండగా నలుగురు వ్యక్తులు వచ్చి ఆమెను దుపట్టాతో లాక్కెళ్లి అత్యాచారం జరిపారు. ఉన్నతవర్గానికి చెందిన నలుగురు అత్యాచారం జరిపి యువతి నాలుక కోసి హింసించారు.


దీంతో బాధిత యువతిని ఢిల్లీ ఆసుపత్రిలోని ఐసీయూలో చేర్పించారు. యువతి చికిత్స పొందుతూ మరణించింది. తాము ఫిర్యాదు చేసినా యూపీ పోలీసులు పట్టించుకోలేదని బాధిత యువతి కుటుంబసభ్యులు ఆరోపించారు. కాగా తాము నిందితులను అరెస్టు చేశామని హత్రాస్ పోలీసు అధికారి ప్రకాష్ కుమార్ చెప్పారు. 

Updated Date - 2020-09-29T15:17:44+05:30 IST