ఘజియాబాద్‌లోని సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2020-07-27T15:49:45+05:30 IST

ఓ నల్లరంగు సూట్ కేస్‌లో నవ వధువు మృతదేహం వెలుగుచూసిన ఘటన...

ఘజియాబాద్‌లోని సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యం

ఘజియాబాద్ (ఉత్తరప్రదేశ్): ఓ నల్లరంగు సూట్ కేస్‌లో నవ వధువు మృతదేహం వెలుగుచూసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ నగరంలో వెలుగుచూసింది. ఘజియాబాద్ నగరంలో పోలీసులకు సోమవారం ఉదయం 8 గంటలకు ఓ నల్లరంగు సూట్ కేస్ కనిపించింది. అనుమానాస్పద స్థితిలో ఉన్న సూట్ కేస్ ను పోలీసులు స్వాధీనం చేసుకొని దాన్ని తెరచి చూడగా ఓ మహిళ మృతదేహం కనిపించింది. సూట్ కేస్ లో మృతదేహమై కనపించిన మహిళకు ఇటీవల పెళ్లి అయిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎవరో మహిళను హతమార్చి ఆమె మృతదేహాన్ని సూట్ కేస్ లో పెట్టారని పోలీసులు చెప్పారు. 

Updated Date - 2020-07-27T15:49:45+05:30 IST