వాడేసిన మాస్కులు ఉతికి, ఇస్త్రీ చేసి అమ్మేస్తున్నారు!

ABN , First Publish Date - 2020-04-15T03:25:33+05:30 IST

కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మాస్కులు చాలా ముఖ్యం.

వాడేసిన మాస్కులు ఉతికి, ఇస్త్రీ చేసి అమ్మేస్తున్నారు!

ముంబై: కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మాస్కులు చాలా ముఖ్యం. అలాంటి మాస్కుల్లో కూడా కొందరు నీచులు కల్తీ చేస్తున్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌కు చెందిన ముగ్గురు దుండగులు.. వాడేసిన ఎన్95 మాస్కులను సేకరించి, ఉతికి ఇస్త్రీ చేసి మళ్లీ అమ్మేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేసి వీరి వద్ద నుంచి 25వేలపైగా సెకండ్ హ్యాండ్ ఎన్95 మాస్కులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.50లక్షలపైనే ఉంటుందని అధికారులు వెల్లడించారు. ముగ్గురు నిందితులపై నిత్యావసరాల చట్టం, ఎపిడెమిక్స్ చట్టం, కొవిడ్ చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు.

Updated Date - 2020-04-15T03:25:33+05:30 IST