ప్రత్యక్ష నరకం.. కోతిని కదలకుండా చేసి కర్రలతో పొడుస్తూ...

ABN , First Publish Date - 2020-07-19T16:58:49+05:30 IST

కోతిని చిత్రహింసలకు గురి చేసి పైశాచికానందం పొందిన నరరూప రాక్షసులను యూపీ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు.

ప్రత్యక్ష నరకం.. కోతిని కదలకుండా చేసి కర్రలతో పొడుస్తూ...

లక్నో: కోతిని చిత్రహింసలకు గురి చేసి పైశాచికానందం పొందిన నరరూప రాక్షసులను యూపీ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. వారి వికృత చేష్టల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో స్థానిక ఫిల్‌బిట్ ప్రాంతంలో కలకలం రేగింది. కోతిని నేలకు అదిమి కదలకుండా చేసిన దుండగులు దాన్ని కర్రలతో పోడుస్తూ చిత్రహింసల పాలు చేశారు. ఆ తరవాత దాన్ని ఒంటిపై నల్లని రంగు పూశారు. అనంతరం.. దానికి కట్టి ఉంచిన తాడును విప్పతీయడంతో కోతి వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇలా ప్రాణ భయంతో పారిపోతున్న కోతిని వారు వెంటబడి తరుముతూ వికృతానందం పొందారు. ఇదంతా వీడియోలో చూసిన సామాన్యులు, జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఆ క్రూర మృగాలను జైల్లోకి నెట్టాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 


Updated Date - 2020-07-19T16:58:49+05:30 IST