అర్జెంట్‌గా కాల్‌ చేసుకోవాలని ఫోన్‌తో పరారీ

ABN , First Publish Date - 2020-12-27T13:36:17+05:30 IST

అర్జెంట్‌గా కాల్‌ చేయాలని ఫోన్‌ తీసుకుని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై

అర్జెంట్‌గా కాల్‌ చేసుకోవాలని ఫోన్‌తో పరారీ

హైదరాబాద్/జీడిమెట్ల : అర్జెంట్‌గా కాల్‌ చేయాలని ఫోన్‌ తీసుకుని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై ఉడాయించిన ఉదంతమిది. షాపూర్‌నగర్‌ మస్తానా హోమ్స్‌లో నివాసముండే యూసఫ్‌పాషా(16) శనివారం సుమారు 11.15 గంటలకు ఆటో కోసం షాపూర్‌నగర్‌ బస్టా‌ప్‌‌లో వేచి ఉన్నాడు. అక్కడికి బైక్‌పై వచ్చిన ఇద్దరు అర్జెంట్‌గా కాల్‌ చేసుకోవాలని యూసఫ్‌పాషాను ఫోన్‌ అడిగారు. ఇవ్వగానే ఫోన్‌తో ఫరారయ్యారు. దీంతో బాధితుడు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-27T13:36:17+05:30 IST